Rgv: జాన్వీ కపూర్ తో మూవీ చేసే ఉద్దేశం లేదు..! 2 d ago
జాన్వీ కపూర్ తో తనకు మూవీ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడారు. "పదహారేళ్ళ వయసు లేదా వసంత కోకిల సినిమా ఏదైనా సరే శ్రీదేవి యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే శ్రీదేవి యాక్టింగ్ చూసాక నేనొక ఫిలిం మేకర్ అనే సంగతే మర్చిపోయి ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా. అది ఆమె స్థాయి అని ఆర్జీవీ చెప్పారు. మరి శ్రీదేవి కుమార్తె "జాన్వీ కపూర్"తో మూవీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా. నాకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం. ఆమెను ఎంతో అభిమానిస్తుంటా. ఇన్నేళ్ల కెరీర్ లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అలాగే, జాన్వీ కపూర్ తోను సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.